
తాజా వార్తలు
‘ఫైనల్’లో ఆమె మహానటి.. ఊసరవెల్లి
హైదరాబాద్: ‘ఢీ’ డ్యాన్స్ షో అంటేనే వావ్ అనిపించే డ్యాన్స్‌లు, అదిరిపోయే స్టెప్పులు. అలాంటి షో ఫైనల్స్ అంటే మామూలుగా ఉండకూడదు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ‘ఢీ ఛాంపియన్స్’ ఫైనల్ ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫైనల్లో కంటెస్టెంట్లను ప్రోత్సహించడానికి ఢీ టీమ్ గణేశ్ మాస్టర్, రాబర్ట్ మాస్టర్, పాపి మాస్టర్ లాంటి కొరియాగ్రాఫర్లను తీసుకొచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఢీ స్టేజీతో, శేఖర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధం, స్నేహం గురించి గుర్తు చేసుకున్నారు.
‘మహానటి’లోని ‘అభినేత్రి.. ఓ అభినేత్రి...’ పాటకు తేజు అదరగొట్టింది. గడియారం ముల్లు లాంటి అమరికకు వేలాడుతూ సోమేశ్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జడ్జిలు కూడా అదే మాట అన్నారు. ఇంకో వైపు ‘ఎవరెవరో...’ పాటకు ప్రదీప్ దుమ్ము దులిపేశాడు. మొదట్లో ‘అభినేత్రి..’ అంటూ క్లాసికల్ టచ్ ఇచ్చిన తేజు... ‘ఊసరవెల్లి...’ అంటూ మాస్ మూమెంట్స్ కూడా వేసింది. ఇవన్నీ వచ్చే బుధవారం (డిసెంబర్ 2)న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్’ చూడొచ్చు. ఈలోగా ప్రోమోలో కొంచెం కొంచెం చూసేయండి.