
తాజా వార్తలు
కాంట్రాక్ట్ వల్ల హిట్ సినిమాలు వదులుకున్నా..
హైదరాబాద్: లఘుచిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి.. ‘కేటుగాడు’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి చాందిని చౌదరి. సరైన విజయం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆమెకు ఇటీవల ‘కలర్ ఫొటో’ మర్చిపోలేని అనుభూతిని అందించింది. అందులో సుహాస్ సరసన దీప్తి వర్మ పాత్రలో చాందిని నటించి మెప్పించారు. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు తన కెరీర్‌కు గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.
‘‘కెరీర్ ప్రారంభంలో చాలామందిలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలసి రాలేదు. అలాంటి సమయంలో కలర్‌ఫొటో’ నాకు మాంచి విజయాన్ని అందించింది. అయితే ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లు నా వద్దకు వచ్చాయి. అదే సమయంలో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర నేను కాంట్రాక్ట్‌లో ఉన్నాను. దానివల్ల రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయింది. అలా ‘కుమారి 21F’, ‘పటాస్’లో నటించే అవకాశం కోల్పోయాను. అయితే ఇన్నాళ్ల నా కష్టానికి తగిన ప్రతిఫలం ‘కలర్‌ఫొటో’తో లభించింది’’ అని చాందిని తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
