స్వల్పంగా తగ్గిన చమురు ధరలు - Diesel price dips below Rs 73 petrol rate cut for 2nd time in six months
close
Updated : 13/09/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్పంగా తగ్గిన చమురు ధరలు

దిల్లీ: అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో చమురు ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసలను చమురు రంగ సంస్థలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.81.99 ఉండగా ప్రస్తుతం రూ.81.86కు చేరింది. మూడు రోజుల్లో పెట్రోల్‌ ధరను తగ్గించడం ఇది రెండోసారి. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌ 10న మొదటిసారి పెట్రోల్‌ ధరను 9 పైసలు తగ్గించగా ఇప్పుడు 12 పైసలు తగ్గించారు. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌ 3న మొదటిసారి డీజిల్‌ ధర తగ్గించిన సంస్థలు ఈరోజు మరోసారి ధరలను కుదించాయి. దిల్లీలో లీటర్‌ ధర రూ.73.05 ఉండగా ఇప్పుడు రూ.72.93కి చేరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని