రికార్డు సృష్టించిన ‘దిల్‌ బేచారా’ - Dil Bechara Sushant Film Gets IMBD Rating 10 out of 10
close
Updated : 26/07/2020 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు సృష్టించిన ‘దిల్‌ బేచారా’

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’. ముఖేశ్‌ చబ్రా దర్శకుడు. సంజనా సంఘీ కథానాయిక. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా తాజాగా విడుదలైంది. సుశాంత్‌ నటన, నాయకనాయికల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ డేటాబేస్‌ వెబ్‌సైట్‌ ఐఎండీబీ  ఈ చిత్రానికి 10/10 రేటింగ్‌ ఇచ్చింది. మొత్తం 1048 రేటింగ్స్‌ ఆధారంగా దీన్ని ఇచ్చారు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ ‘దిల్‌ బేచారా డే’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

సుశాంత్‌ నటించిన చివరి చిత్రానికి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎండీబీ 10/10 ఇవ్వడం పట్ల సుశాంత్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనదైన నటనతో సుశాంత్‌ మరోసారి ఆకట్టుకున్నాడని, ఆయన బతికి ఉంటే ఈ చిత్ర విజయాన్ని తప్పకుండా ఆస్వాదించేవారని అభిప్రాయపడ్డారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని