close

తాజా వార్తలు

Published : 23/10/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

18 దేశాల్లో డీడీఎల్‌జే మళ్లీ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన చిత్రాల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్‌జే). షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఇటీవల 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టెలివిజన్‌లో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. తాజాగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 దేశాల్లో మళ్లీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్‌ఏ, యూకే, కెనడా, మారిషస్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిజి, నార్వే, స్వీడెన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ ఎస్టోనియా, ఫిన్లాండ్‌ దేశాల్లో విడుదల అవుతున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. త్వరలో ఈ జాబితాలో మరికొన్ని దేశాలు చేరే అవకాశం ఉంది.

దీనిపై ఇంటర్నేషనల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఉపాధ్యక్షుడు నెల్సన్‌ డిసౌజా స్పందిస్తూ, ‘డీడీఎల్‌ఏ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, తన ప్రేమతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పెద్ద తెరపై మళ్లీ సినిమా చూసే అవకాశం దీని ద్వారా ప్రేక్షకులకు లభిస్తోంది’’ అని అన్నారు.

1995లో విడుదలైన ఈ చిత్ర మొత్తం బడ్జెట్‌ రూ.4కోట్లు. ఆ ఏడాది భారత్‌లో ఈ సినిమా ఏకంగా రూ.89కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ.13.50కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు పరిశీలిస్తే రూ.100కోట్లు దాటింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.