‘మూడో ప్రపంచ యుద్ధానికంటే ప్రమాదకరం’ - Director Puri Jagannadh about Acid Rain
close
Updated : 12/10/2020 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మూడో ప్రపంచ యుద్ధానికంటే ప్రమాదకరం’

‘యాసిడ్‌ రెయిన్‌’ గురించి పూరీ జగన్నాథ్‌ 

హైదరాబాద్‌: కాలుష్యం తగ్గకపోతే మానవాళికి ముప్పు తప్పదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ హెచ్చరించారు. కరోనా, మూడో ప్రపంచ యుద్ధానికి మించిన సమస్య ‘యాసిడ్‌ రెయిన్‌’ అని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన తాజాగా ‘యాసిడ్‌ రెయిన్‌’ గురించి మాట్లాడారు. ప్రపంచ జనాభా తగ్గితే సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.

‘అనేక ఏళ్ల క్రితం వర్షాలు పడి భూమిపై సముద్రాలు తయారయ్యాయి. రకరకాల జీవులు పుట్టాయి.. అన్నీ హాయిగా ఆడుకుంటున్నాయి. అయితే 250 మిలియన్‌ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు పేలడం వల్ల అనేక రసాయనాలు విడుదలై, ఆకాశం నుంచి వర్షం పడింది. అది మామూలు వర్షం కాదు.. యాసిడ్‌ రెయిన్‌. నైట్రిక్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌తో కూడిన వర్షం. ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. 2 మిలియన్‌ సంవత్సరాలు పడింది. దాంతో సముద్రంలోని అన్నీ జలచరాలు చనిపోయాయి. నేలపై ఉన్న జంతువులు కూడా చనిపోయాయి. యాసిడ్‌ వర్షం తర్వాతే సముద్రం నీరు ఉప్పగా మారింది. దానికి తగ్గట్టుగా మళ్లీ జలచరాలు పుట్టాయి. మానవులు కూడా పుట్టారు. అలా బతుకుతూ.. ఇలా కరోనా వరుకు వచ్చాం’.
‘కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి రోజూ మనం బొగ్గును కాలుస్తున్నాం. వీటి వల్ల మళ్లీ యాసిడ్‌ వర్షం పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే ముందు పక్షులు, ఆపై చెట్లు చనిపోతాయి. ఆ తర్వాత మనం కూడా మరణిస్తాం. అప్పట్లోలా అన్ని ఏళ్లు వర్షం పడాల్సిన అవసరం లేదు.. రెండు వారాలు పడితే చాలు.. మనం చనిపోతాం. ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కొత్త వైరస్‌ల కోసం వ్యాక్సిన్‌లు కనిపెట్టి, భద్రంగా పెట్టుకోవచ్చు. కానీ యాసిడ్‌ వర్షం నుంచి ఎవరూ కాపాడలేరు. వైరస్‌లు, మూడో ప్రపంచ యుద్ధం కంటే అత్యంత ప్రమాదం ఏదైనా ఉందంటే.. అది యాసిడ్‌ వర్షం మాత్రమే. మనుషులు పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతుంది. ఏదో ఒక రోజు వరుణ దేవుడు.. ఈ ఇడియట్స్‌కు యాసిడ్‌ వర్షం అవసరం ఉంది అనుకున్నాడంటే.. ఇకంతే.. ఇలాంటి ప్రళయాలు ఆగాలంటే ఇప్పుడున్న జనాభా 80 శాతం తగ్గాలి. అది తగ్గదు.. చెప్పినా మనం వినం. ‘పిల్లలు వద్దురా..’ అంటే.. ‘ఎప్పుడో వచ్చే యాసిడ్‌ వర్షానికి ఇప్పుడు నా బిడ్డ కారణమా?..’ అంటాం..’ అని పూరీ తన స్టైల్‌లో చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని