ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ - Disha Patani to romance with Prabhas in Salaar
close
Published : 24/12/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ బార్డర్లు దాటి పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సాహో స్టార్‌తో ఆడిపాడేందుకు బాలీవుడ్‌ హీరోయిన్లు సైతం క్యూకడుతున్నారు. కొద్దిరోజుల్లో.. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనుంది. అందులో ప్రభాస్‌తో జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశాపటానిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇంతవరకూ చిత్ర బృందం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే మరి.

కాగా.. ‘బాహుబలి’ ‌స్టార్‌ ప్రభాస్‌, ‘కేజీఎఫ్‌’ కెప్టెన్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు ‘సలార్‌’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా వరుణ్‌తేజ్‌ హీరోగా వచ్చిన ‘లోఫర్‌’ సినిమాతో దిశా పటాని తెలుగు తెరకు పరిచయమైంది. అది బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఈమె నటించిన చిత్రాలు ‘ఎంఎస్‌.ధోనీ’, ‘బాఘీ’ ఈ ముద్దుగుమ్మకు మంచిపేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ఖాన్‌ సరసన ‘రాధే’, మరో హిందీ చిత్రంలోనూ నటిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, ప్రసిద్ధ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి..

హీరో మీదకి చెప్పు విసిరారు: మయూరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని