డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధానికి అమెరికాలో అనుమతి - Dr. Reddys drug is licensed in the United States
close
Published : 28/07/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధానికి అమెరికాలో అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: తలలో పేలకు చికిత్సగా వినియోగించే జెగ్లైజ్‌ లోషన్‌ (అబమెటాపిర్‌) ఔషధానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ ఔషధాన్ని విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌, 2015లో ఆస్ట్రేలియాకు చెందిన హ్యాచ్‌టెక్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి వచ్చిన నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, హ్యాచ్‌టెక్‌కు ‘ప్రీ-కమర్షియలైజేషన్‌ మైల్‌స్టోన్‌’ చెల్లింపుల కింద డాక్టర్‌ రెడ్డీస్‌ 20 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) చెల్లించాల్సి వస్తుంది. ఈ ఔషధాన్ని యూఎస్‌లో కొన్ని భాగస్వామ్య సంస్థల ద్వారా విక్రయించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ సందర్బంగా వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని