గడువులోపే బిహార్‌ ఎన్నికలు: ఈసీ - EC on Bihar state Assembly elections
close
Updated : 23/08/2020 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గడువులోపే బిహార్‌ ఎన్నికలు: ఈసీ

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని, అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని పలు పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈసీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. దీంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్‌ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యంగా బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్‌ ఏస్తోంది. ఎన్‌సీపీ, ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్న ఎల్‌జేపీ సైతం వాయిదాను కోరుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీలు ఇటీవల ఈసీకి లేఖ కూడా రాశాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను ఈసీ జారీ చేసింది. ఓటర్లకు గ్లవ్స్‌, పోలింగ్‌ కేంద్రాల్లో శానిటైజేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలతో పాటు నామినేషన్‌, ఇంటింటి ప్రచారానికి సంబంధించిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకవేళ ఏదైనా కారణంతో ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో ఈసీ న్యాయశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు గల కారణాలు తెలపాల్సి ఉంటుంది. గడువు ముగిసినా ఎన్నికలు జరగకపోతే ఆ రాష్ట్రం పాలన కేంద్రం చేతిల్లోకి వెళ్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని