ఆ టీకా వృద్ధులకూ పనిచేస్తోంది..! - Early study shows Moderna covid vaccine working in older adults
close
Updated : 30/09/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ టీకా వృద్ధులకూ పనిచేస్తోంది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మోడెర్నా టీకా ప్రయోగాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వృద్ధుల్లో కూడా వైరస్‌ను చంపే యాంటీబాడీలను ఈ టీకా తయారు చేస్తోందని తేలింది. ఈ యాంటీబాడీల స్థాయి కూడా యువతలో ఉన్నంతే ఉంటున్నట్లు సమాచారం. ఫ్లూషాట్‌ హైడోస్‌లో ఉన్నంత స్థాయిలోనే సైడ్‌ఎఫెక్టులు కూడా ఉన్నట్లు పరిశోధకులు మంగళవారం వెల్లడించారు.

వీరి పరిశోధనను న్యూఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు. కొవిడ్‌ కారణంగా తీవ్రమైన ప్రభావానికి గురయ్యే  ముప్పున్న వృద్ధులపై కూడా ఈ టీకా బాగా పని చేస్తున్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. ఈ ఫలితాలు ఆశలు రేకెత్తించేలా ఉన్నాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఇవాన్‌ అండర్సన్‌ పేర్కొన్నారు. 18-55 ఏళ్ల మధ్య వారిపై మోడెర్నా నిర్వహించిన ఫేజ్‌1 పరిశోధనలకు కొనసాగింపుగా దీనిని నిర్వహించారు. రెండు డోసులుగా వర్గీకరించి ప్రయోగించారు. ఒక డోసు కింద 25 మైక్రోగ్రాములు.. రెండో డోసుకింద 100 మైక్రోగ్రాములను వినియోగించారు. 56-70, 71 నుంచి ఆపై వయుస్సు వారిని మరోబృందంగా ఎంచుకొన్నారు. మొత్తం 40 మందిపై దీనిని ప్రయోగించారు. 71 ఏళ్ల పైబడిన వృద్ధులపై 100 మైక్రోగ్రాములను 28 రోజుల తేడాతో ప్రయోగించారు. వీరిలో యువతతో సమానంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని