దానికోసం శిక్షణ తీసుకుంటున్నా! - Eesha Rebba about his boxing training
close
Published : 31/08/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దానికోసం శిక్షణ తీసుకుంటున్నా!

హైదరాబాద్‌: తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కథానాయిక ఈశా రెబ్బా. అందం, నటనతో ఆకట్టుకుంటున్నా, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్న చిత్రాలు ఒకట్రెండు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో బాక్సర్‌గా అభిమానులను ఆకట్టుకోనుంది. దీని కోసం ఈ చిన్నది ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. తాజాగా తన కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడింది.

‘నేను నా తరువాత చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నా. మానసికంగా, శారీరకంగా ఈ పాత్రలో లీనమవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఇదే కాదు జిమ్నాస్టిక్స్‌లోనూ తర్ఫీదు పొందుతున్నా. నిజమైన బాక్సర్‌లా తెరపై చెలరేగడమే నా ముందున్న లక్ష్యం.’ అంటూ చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ... ఇది తనకు క్రమశిక్షణ నేర్పించిందని తెలిపింది. ఈ ముద్దుగుమ్మ సినిమాకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని