టీకా అత్యవసర వినియోగానికి అప్పుడే అనుమతి - Emergency use authorisation for COVID vax only after detailed analysis Niti Member
close
Published : 13/12/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా అత్యవసర వినియోగానికి అప్పుడే అనుమతి

దిల్లీ: సురక్షితం, సామర్థ్యం సహా అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే కొవిడ్‌-19 టీకా అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతి ఇస్తుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. దేశంలో కోట్ల మందికి ఏటా వ్యాక్సిన్లు ఇవ్వడం, అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటివి టీకాను లక్షిత బృందాలకు చేర్చేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాయని ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో ఆయన పేర్కొన్నారు.

‘శాస్త్రీయ ఫలితాల ఆధారంగా కొవిడ్‌ 19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికైతే మూడు సంస్థలు అర్జీ పెట్టుకున్నాయి. ఫైజర్‌, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ తుది గడువును సమీపించాయి. శాస్త్ర, నిబంధనల ఆధారంగా వీటిపై నిర్ణయం తీసుకుంటాం. మా నియంత్రణ సంస్థ సరైన నిర్ణయం తీసుకుంటుంది. సురక్షితం, రోగనిరోధక శక్తి, సామర్థ్యం ఆధారంగా నిర్ణయం ఉంటుంది. ఏక్షపక్షంగానో మరో విధంగానో నిర్ణయం తీసుకోవాలని డీజీసీఐపై మేం ఒత్తిడి చేయడం లేదు. అధికారికంగా నేనిది చెప్పగలను. వారి నిర్ణయాత్మక ప్రక్రియను మేం గౌరవిస్తాం’ అని వీకే పాల్‌ తెలిపారు.

బ్రిటన్‌ నియంత్రణ సంస్థతో డీజీసీఐ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పాల్‌ స్పష్టం చేశారు. ‘రెండు దేశాల ఉమ్మడి వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా మేం కలిసి పనిచేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. తొలుత ఎవరికి అవసరం ఉంటుందో టీకా పంపిణీలో వారికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ వైద్య యంత్రాంగం, ఆస్పత్రులు, వ్యవస్థపైనే ఆధారపడకుండా ఇతర వ్యాక్సినేటర్లను పిలిచామని వెల్లడించారు. ఫలితంగా టీకా పంపిణీ వేగవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికెప్పుడు టీకా ఇవ్వాలో, తీసుకోవాలో సమాచారం ఇచ్చేందుకు పటిష్ఠమైన ఐటీ వేదికను సృష్టిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం, ఏటా చిన్నారులు, మహిళలకు 650 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇస్తుండటం కొవిడ్‌-19 టీకా పంపిణీ విజయవంతం చేసేందుకు విశ్వాసాన్ని అందిస్తున్నాయన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని