‘ఆర్ఆర్‌ఆర్‌’: ఇక మా వంతు! - Enough of our festival posts says RRR team
close
Updated : 05/10/2020 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్ఆర్‌ఆర్‌’: ఇక మా వంతు!

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉన్న సినీ ప్రాజెక్టుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కీలక పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దీన్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ తప్ప ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్‌ రాలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు శుభవార్త చెప్పింది. ట్విటర్‌ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది.

‘‘పండగలకు అప్‌డేట్‌ల కోసం క్రియేటివిటీని చూపిస్తూ వ్యంగ్యంగా మీరు చేసే పోస్టులు ఇక చాలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. కాలం వేగంగా గడిచిపోయింది. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి మిమ్మల్ని అలరించడం మా వంతు. రేపటి వరకూ వేచి ఉండండి.’’ -ట్విటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం

రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్‌ ఆ అంచనాలను పెంచింది. ఇక కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ దర్శనమివ్వనున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 8, 2021న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినా కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్‌ ఆసక్తిగా మారింది. ‘ #WeRRRBack ’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జోడించడం చూస్తే, షూటింగ్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొమరం భీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌ లుక్‌కు సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ ఇస్తారా? లేక ఇంకేదైనా చెబుతారా? తెలియాలంటే రేపటి వరకూ వేచి చూడాలి. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని