close

తాజా వార్తలు

‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘మనుషులం మనందరం ఏకాకులం కాదే ఎవ్వరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం’ అని అంటున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది.‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏదారుల్లో ఏ బంధం ఉందో బంధువుల సంఖ్య పెంచుకుందాం’ అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలు అలపించారు. ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని వాయిదా వేసి నేడు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, నరేష్‌, అన్నపూర్ణ, సుహాసిని కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.