భారత్‌లో నమోదు కాకున్నా..విదేశాల్లో చేసుకోవచ్చు! - Even if you are not registered in India you can do it abroad
close
Published : 16/10/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో నమోదు కాకున్నా..విదేశాల్లో చేసుకోవచ్చు!

నిబంధనలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

విదేశాల్లో లిస్టింగ్‌ అయ్యే కంపెనీలకు ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేస్తోంది. భారత్‌లో నమోదు కాకున్నా నేరుగా విదేశాల్లో నమోదయ్యేందుకు వీలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అంకురాలు అధిక విలువ దక్కించుకోవడానికి, మూలధానాన్ని సులువుగా పొందడానికి తప్పనిసరి సెకండరీ లిస్టింగ్‌ను పక్కన పెడుతున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న ఇద్దరు సీనియర్‌ అధికారులు, ఇద్దరు పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. అయితే భారత కంపెనీలు తప్పనిసరిగా దేశీయ ఎక్స్ఛేంజీల్లోనూ నమోదు కావాలని అంతర్జాతీయ మదుపర్లు, కంపెనీల అధికారులు అనధికారికంగా పేర్కొనడంతో ఆందోళనలు పెరిగాయి. అయితే ఈ చర్చల్లో నేరుగా పాల్గొంటున్న ఒక ప్రభుత్వ అధికారి మాత్రం అటువంటి తప్పనిసరి నమోదు ఏదీ ఉండదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఎందుకు తన వైఖరిని మార్చుకుందో ఆయన వివరించలేదు. కాగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెబీ ఈ విషయంలో ఇంకా స్పందించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని