కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి - Ex mla rajaiah died
close
Updated : 04/08/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దికాలంగా తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో రాజయ్య ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కరోనా సోకింది. వారు రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజయ్య తన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సున్నం రాజయ్య నిబద్ధత కలగిన వామపక్షవాది అని సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి  అన్నారు. రాజయ్య ఆకస్మికమృతి దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంతో నిలబడ్డారని కొనియాడారు. రాజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజయ్య మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం నేత వైవీ ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగ నిరతితో కూడిన ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని