దిల్లీలో గరిష్ఠ స్థాయిలో సెకండ్ వేవ్:కేజ్రీవాల్ - Experts Believe Second Wave Of COVID At Peak
close
Published : 25/09/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో గరిష్ఠ స్థాయిలో సెకండ్ వేవ్:కేజ్రీవాల్

రానున్న రోజుల్లో తగ్గుతుందని నిపుణుల అంచనా

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో ఉందని, రానున్న రోజుల్లో ఆ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘జులై 1 నుంచి ఆగస్టు 17 వరకు వైరస్‌ నియంత్రణలోనే ఉంది. తర్వాత కేసులు పెరగడం, సెప్టెంబరు 17న కొత్తగా 4,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. నిపుణులు అంచనా ప్రకారం.. దిల్లీలో సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో ఉంది. రానున్న రోజుల్లో ఆ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.  కొవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదైనప్పుడు కేంద్రం, ఎన్‌జీఓలు, దిల్లీ వాసుల సహకారంతో వాటిని నియంత్రించగలిగాం. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, పరీక్షల సంఖ్యను 20 వేల నుంచి 60 వేలకు పెంచాం’ అంటూ ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రధాని నేతృత్వంలో కొవిడ్ కట్టడికి సంబంధించి వర్చువల్ సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందని తెలిపారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..దిల్లీలో 30,836 క్రియాశీల కరోనా కేసులున్నాయి. కోలుకున్న వారి సంఖ్య 2,20,866గా ఉండగా..5,087 మంది మరణించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని