కడుపుబ్బా నవ్విస్తోన్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ - Extra Jabardasth latest promo
close
Updated : 06/07/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కడుపుబ్బా నవ్విస్తోన్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’

హైదరాబాద్‌: గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, రష్మిల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. 

షోలో భాగంగా సుడిగాలి సుధీర్‌, రోజా మధ్య జరిగే సంభాషణలతో నవ్వులు పూయించనున్నారు. అయితే త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో భాగంగా సరదా సత్తిపండు..అదుర్‌ ఆనంద్‌ టీమ్‌.. భర్తకు గౌరవం ఇస్తూ.. భార్య చేతిలో దెబ్బలు తిన్న ఆనంద్‌.. ‘జామకాయ అన్నాకా చిలక్కొట్టిద్ది.. పొలం అన్నాకా ఎలక్కొట్టిద్ది.. భర్త అన్నాకా భార్య కొడుతుంది.. ఇది మా ఆయన వింటే.. నన్ను కొడతాడు’ అంటూ సరదాగా వరుస పంచులతో నవ్వుల వర్షం కురిపించనున్నారు. వచ్చే శుక్రవారం (నవంబర్‌ 27) ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి..!
 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని