FAU-G: ప్రి-రిజిస్ట్రేషన్‌కు అవకాశం.. అయితే - FEARLESS AND UNITED GUARDS PRE REGISTER AVILABLE IN GOOGLE PLAY STORE
close
Published : 01/12/2020 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

FAU-G: ప్రి-రిజిస్ట్రేషన్‌కు అవకాశం.. అయితే

ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే.. 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉంచిన గేమ్‌ డెవలపర్లు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ గేమ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే పబ్‌జీతో సహా చైనాకు చెందిన పలు యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అదే క్రమంలో పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) పేరుతో గేమ్‌ను తీసుకొస్తున్నట్లు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయదశమి నాడే తీసుకొస్తామని ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఫౌజీకి సంబంధించి అప్‌డేట్‌ వచ్చేసింది. ప్రి-రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తూ  గూగుల్‌ ప్లేస్టోర్‌లో మొబైల్‌ యాప్‌ను డెవలపర్లు అందుబాటులోకి తెచ్చారు.  ఈ గేమ్‌ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా దేశ సైనికుల త్యాగాలను తెలియజేప్పేందుకు రూపొందించారు. ఫౌజీని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్‌కోర్ గేమ్స్‌ అనే సంస్థ రూపొందించింది. అక్షయ్‌ కుమార్ దీని మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫౌజీ గేమ్‌ ప్రి-రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లేస్టోర్‌కు వెళ్లి FAU-G:Fearless and United Guards అని టైప్‌ చేస్తే ప్రి రిజిస్టర్‌ లింక్‌ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫౌజీ మొబైల్‌ యాప్‌ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఓ నోటిఫికేషన్‌ వస్తుంది. అర్హత కలిగిన డివైజెస్‌కు మాత్రమే నోటిఫికేషన్‌ వస్తుంది. అప్పుడు యాప్‌ డౌన్‌లోడ్‌ అయి ఇన్‌స్టాల్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇప్పటి వరకు యాప్‌ డౌన్‌లోడ్‌ సైజ్‌, వెర్షన్‌ సహా ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు ప్రి-రిజిస్టర్ అవకాశం కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు పబ్‌జీ మొబైల్‌ ఇండియా కూడా దేశీయంగా మళ్లీ వచ్చేందుకు సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన మాతృ సంస్థ క్రాఫ్టన్‌తో కలిసి భారత్‌లో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని