సోనూ.. నాకు ఎమ్మెల్యే టికెట్‌ కావాలి - Fan Asks Sonu Sood for BJP Party Ticket
close
Published : 18/09/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ.. నాకు ఎమ్మెల్యే టికెట్‌ కావాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేయటానికి టికెట్‌ ఇప్పించమని నటుడు సోనూసూద్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా కోరారు. లాక్‌డౌన్‌ ప్రారంభం అయిన నాటి నుంచి సోనూసూద్‌ చేస్తున్న సాయం గురించి మనం వింటూనే ఉన్నాం. వలస కార్మికులకు ఆహారం అందించటం, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చటం.. ఎక్కడ సహాయం అని వినిపిస్తే అక్కడ కనిపిస్తున్న ఈ నటుడిని బిహార్‌ వాసి భాగల్‌పూర్‌ భాజపా ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించమని వింత కోరిక కోరాడు.

దీనిపై చమత్కారంగా స్పందించారు సోనూసూద్. తాను బస్సు, రైలు, విమానాల టికెట్లను మాత్రమే అందించగలనని నవ్వుతున్న ఎమోజీతో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. ఇటీవల మరో మంచి పనికి కూడా సోనూ శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించబోతున్నట్లు ప్రకటించారు. scholarships@sonusood.me ద్వారా దరఖాస్తు చేసుకోమని కోరారు. ‘పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలంటే ఎంత కష్టపడుతున్నారో గత కొన్ని నెలలుగా చూస్తున్నా. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావడానికి కొంత మంది దగ్గర  కనీసం ఫోన్లు కూడా లేవు, మరికొందరి వద్ద ఫీజు కట్టేందుకు డబ్బులు లేవు. అందుకే  దేశవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నా. నా తల్లి పేరు మీద స్కాలర్‌ షిప్‌ ఇస్తానని మాటిస్తున్నా. ఆమె పంజాబ్‌లో ఉచితంగా పిల్లలకు పాఠాలు చెప్పేవారు. నన్ను కూడా విద్యార్థులకు సాయం చేయమని కోరేవారు. ఇన్నాళ్లకు ఈ రూపంలో దాన్ని నెరవేరుస్తున్నా. ఇదే సరైన సమయమని నాకు అనిపించింది’ అని సోనూసూద్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని