మీరు ప్రెగ్నెంటా?.. సమంత జవాబిదీ.. - Fan asks Samantha if she is pregnant
close
Published : 30/08/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరు ప్రెగ్నెంటా?.. సమంత జవాబిదీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయిక సమంత. ఈ ఏడాది ‘జాను’ చిత్రం తర్వాత ఆమె మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం ‘ఫ్యామిలీమెన్‌2’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు విరామం దొరకడంతో మిద్దెపై వ్యవసాయం చేస్తూ, ఆ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికరంగా సమధానం ఇచ్చారు.

‘మీరు గర్భిణియా?’ అని అడగ్గా, ‘బహుశా నేను 2017 నుంచి గర్భంతో ఉన్నా. బిడ్డ బయటకు రావడానికి ఇష్ట పడటం లేదనుకుంటా’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు. సామ్‌-చై 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సామ్‌ ఇదిగో ఇలా జవాబులు ఇచ్చారు.

మీ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటి?

సమంత: మీ వాస్తవ ప్రపంచాన్ని మీరే  సృష్టించుకోవడం. మా ఇద్దరి చేతుల(సమంత-నాగచైతన్య)పై ఉంటుంది.ఇది మాకు ఎంతో స్పెషల్‌

వంట చేయడం లేదా వ్యవసాయం చేయడం ఏది ఇష్టం?

సమంత: ప్రస్తుతానికి వ్యవసాయం

మీ హైట్‌ ఎంత?

సమంత: 5 అడుగుల 3 అంగుళాలు

మాకు కిలో క్యారెట్‌ పచ్చడి పంపుతారా?

సమంత:  క్యారెట్‌ పచ్చడి అయిపోయింది. ఈ సారి పంపిస్తా.

‘ఫ్యామిలీమెన్‌’ వెబ్‌సిరీస్‌ ఎప్పుడు చూస్తాం?

సమంత: నా ముఖంలో ఆనందం చూస్తున్నారుగా. త్వరలోనే వచ్చేస్తుంది. డబ్బింగ్‌ కూడా పూర్తయింది.

క్వారంటైన్‌లో మీరు చేసిన ఉత్తమమైన పని ఏంటి?

సమంత: చాలా స్పెషల్‌ త్వరలోనే మీతో పంచుకుంటా

యాక్నే, నిర్జీవమైన చర్మ సమస్యతో బాధపడే యువతకు మీరిచ్చే సూచన ఏంటి?

సమంత: ఎప్పుడూ మీ చర్మాన్ని పొడిగా ఉంచుకోవద్దు... (నవ్వులు)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని