
తాజా వార్తలు
జూనియర్ సమంతపై నెటిజన్ల కామెంట్లు..!
సందేహం అడిగి.. విమర్శలు ఎదుర్కొంటోన్న అత్మిక
చెన్నై: తన సందేహాన్ని సోషల్‌మీడియా వేదికగా బయటపెట్టి.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది నటి అత్మిక. లుక్స్‌పరంగా అగ్రకథానాయిక సమంతలా కనిపిస్తున్నారంటూ చాలామంది ఆమెపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రేమికులు ఆమెను జూనియర్ సమంతగా అభివర్ణిస్తుంటారు. అయితే, కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘మీసాయి మురుక్కు’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా, తాజాగా అత్మిక ట్విటర్ వేదికగా.. ‘‘సినిమా పోస్టర్‌పై ఆ సినిమాలో నటిస్తున్న కథానాయిక పేరును ఎందుకు ఉంచరు? ఈ విషయం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది’’ అని తన సందేహాన్ని బహిర్గతం చేసింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌ను సమర్థించగా.. మరికొంత మంది నెగెటివ్ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ‘మేడమ్.. మీరు ఒక్కసారి ‘అసురన్’, ‘మూకుత్తి అమ్మన్’, ‘నెట్రికన్’ పోస్టర్లు గమనించండి. వాటిపై కథానాయిక పేర్లు కూడా ఉంటాయి’ అని కామెంట్లలో పేర్కొన్నారు. అంతేకాకుండా టాలెంట్ లేకుండానే అత్మిక చిత్రాల్లో నటించే అవకాశం పొందారంటూ విమర్శలు చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
