కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల తిరస్కరణ! - Farmer Unions Reject Centres Offer to Shift Protest Site
close
Updated : 29/11/2020 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల తిరస్కరణ!

దిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తాము చేపట్టిన ‘చలో దిల్లీ’ ర్యాలీ ప్రధాన అజెండా అని పంజాబ్‌ రైతు సంఘాలు తెలిపాయి. రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రతిపాదనను ఆదివారం తిరస్కరించాయి. అంతేకాకుండా తమ ఆందోళనలను దిల్లీలోని బురారీ మైదానానికి తరలించేందుకు సైతం రైతు సంఘాలు నిరాకరించాయి. దిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ... శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనలపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తాము చేపట్టిన చలో దిల్లీ ర్యాలీ ప్రధాన అజెండా అని తెలిపారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఈ రోజు సమావేశం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరసనలు విరమించేది లేదన్నారు. కాగా ఆదివారం సాయంత్రం 4గంటలకు పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలకు చెందిన నాయకులు మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా 32 రైతు సంఘాలతో ముందస్తు చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. రైతులు తమ నిరసనల్ని బురారీలోని నిరంకారీ మైదానానికి తరలించాలని కోరారు. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు చలో దిల్లీ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీలో నిరసనకు ప్రభుత్వం ముందు అనుమతి నిరాకరించడంతో సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద ఐదు రోజులుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో దిల్లీకి వెళ్లే ప్రధాన రహదారులు దిగ్బంధం అయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం స్పందించి డిసెంబర్‌ 3లోగా చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. వారి ఆందోళనల్ని బురారీ మైదానానికి తరలించాలని కోరారు. 

ఓ వైపు రైతుల నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాల్ని దూరం చేసి కొత్త అవకాశాలు కల్పిస్తాయన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే వాటికి పార్లమెంటులో ఆమోదం లభించిందన్నారు. పంట కొనుగోలు పూర్తైన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలని లేని పక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని