వైరస్‌ నుంచి కోలుకున్న మలైకా అరోరా - Feel So Blessed To Overcome this virus says Malaika Arora
close
Published : 20/09/2020 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ నుంచి కోలుకున్న మలైకా అరోరా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ భామ మలైకా అరోరా కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. ఈనెల 7న తాను కొవిడ్ బారిన పడినట్లు మలైకా పేర్కొంది. ఎలాంటి లక్షణాలు లేవని ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది.

కాగా ఈరోజు తిరిగి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలినట్లు పేర్కొంది. చాలా రోజుల తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. వ్యాధి నుంచి బయటపడటం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు నిరంతరం పర్యవేక్షించిన వైద్యులకు, తాను కోలుకోవాలని కోరుకున్న మిత్రులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని