ఆ పాత్ర ఆధారంగా ‘నల్ల గులాబీ’ - First Look of BlackRose Featuring Urvashi Rautela
close
Published : 24/09/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పాత్ర ఆధారంగా ‘నల్ల గులాబీ’

హైదరాబాద్‌: బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలా ‘బ్లాక్‌ రోజ్‌’లా తెలుగు తెరపైకి అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథతో.. దర్శకుడు మోహన్‌ భరద్వాజ్‌ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్‌ చిత్రమిది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఊర్వశి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

షేక్‌స్పియర్‌ రచించిన ‘‘ది మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’లోని షైలాక్‌ పాత్ర ఆధారంగా సంపత్‌ ఈ కథను సిద్ధం చేశారు. 3వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ శక్తిమంతమైన మోడ్రన్‌ మహిళ వసుధ జీవితంలో ఒకరోజు జరిగిన కథ ఈ ‘బ్లాక్‌రోజ్‌’. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒకే   షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని