ఆ రెండింటి కంటే ఆక్స్‌ఫర్డే బెటరేమో..! - Five reasons the Oxford AstraZeneca vaccine is better news than the PfizerModerna shots
close
Updated : 25/11/2020 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రెండింటి కంటే ఆక్స్‌ఫర్డే బెటరేమో..!

 టీకా సామర్థ్యంతో పాటు ఇతర అంశాలూ కీలకమే..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఫైజర్‌ 95 శాతం.. మోడెర్నా టీకా దాదాపు 95 శాతం కరోనాను అడ్డుకొన్నట్లు ఫలితాలను ప్రకటించాయి. అయినా ప్రజలు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఏజెడ్‌డీ1222(కోవిషీల్డ్‌) టీకా ఫలితాల కోసం ఎదురు చూడటం ఆపలేదు. తీరా ఆక్స్‌ఫర్డ్‌ ఫలితాలు 70శాతం నుంచి 90శాతం వరకు మాత్రమే కరోనావైరస్‌ను అడ్డుకొంటాయని తేలింది. అయినా చాలా దేశాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఎందుకు..? 

తక్కువ డోసుకే మంచి సామర్థ్యం..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా విడుదల చేసిన మధ్యంతర ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశం బయటపడింది. నెల వ్యవధిలో రెండు ఫుల్‌ డోస్‌లు టీకా తీసుకొన్నవారిలో కేవలం 62శాతం మాత్రమే రక్షణ కల్పించింది. అదే తొలి డోస్‌లో తక్కువ టీకా తీసుకొని.. రెండో డోసులో పూర్తి టీకా తీసుకొన్న వారిలో 90శాతం కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించింది. ఈ విషయాన్ని ప్లెసిబో(డమ్మీ) టీకా తీసుకొన్న గ్రూపుతో పోల్చి నిర్ధారించారు.  సగం డోసుతోనే అత్యధిక రక్షణ లభించడం శుభపరిణామాం. దీంతో తొలినెలల్లో ఎక్కువ మందికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. తయారీదారులపై ఒత్తిడి తగ్గుతుంది.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అన్ని వయస్సులు, వర్గాల్లో మంచి ఫలితాలు చూపించింది. దీంతోపాటు అసిమ్టమాటిక్‌ ఇన్ఫెక్షన్‌ ముప్పును కూడా తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ఫలితాల్లో చూపించడం గమనార్హం. దీంతోపాటు ఈ టీకా తీసుకొన్న 23వేల మందిలో ఎవరిలోనూ తీవ్రమైన లక్షణాలు కనిపించడం.. లేదా ఆసుపత్రి పాలుకావడం వంటివి జరగలేదు. 

నిల్వ.. సరఫరా తేలిక..

ఆక్స్‌ఫర్డ్‌ టీకాను నిల్వ చేయడం.. సరఫరా చేయడం ఫైజర్‌, మోడెర్నాతో పోలిస్తే చాలా తేలిక.  ఫైజర్‌, మోడెర్నాల టీకాలకు కనీసం మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి  మైనస్‌ 80 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత అవసరం. కానీ ఆక్స్‌ఫర్డ్‌ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా భద్రపర్చుకోవచ్చు. అంటే భారత్‌ వంటి దేశాలకు ఇది అత్యంత అనుకూలమైంది. రవాణా సమయంలో 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత సరిపోతుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా తేలిగ్గా చేర్చవచ్చు.

ధరలో తక్కువ..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంస్థలు మహమ్మారి వ్యాపించిన సమయంలో ఈ టీకాను లాభాపేక్షతో తయారు చేయడంలేదని మొదట్లోనే ప్రకటించాయి. అందుకే వివిధ దేశాలు, ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొన్నాయి. దీని ధర ఒక్కో డోసు 2.50డాలర్లు ఉంటుంది. తొలిడోసు తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉండటంతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అదే ఫైజర్‌ 20 డాలర్లు, మోడెర్నా కనీసం 25 డాలర్లుగా నిర్ణయించాయి. ఇది మన రూపాయల్లోకి మారిస్తే వేలల్లో ఉంటుంది. 

ఒక ఫలితం రెండు టీకాలకు శుభవార్త..!

ఆక్స్‌ఫర్డ్‌ టీకాను మన దేశంలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. ఇప్పటికే నష్టానికి సిద్ధపడి భారీ ఎత్తున ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉంచింది. భారత్‌లో కూడా 1600మందిపై మూడోదశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఏజెడ్‌డీ1222లో చింపాంజీల్లోని అడినో వైరస్‌ను బలహీనపర్చి వినియోగించారు. రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వీ టీకాలో కూడా ఇదే వైరస్‌ను వాడారు. అంటే ఆక్స్‌ఫర్డ్‌ ఫలితం.. స్పుత్నిక్‌-వీ టీకాకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని పెంచింది. దీనిపై ప్రయోగాలను భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ చేపట్టింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని