అంబులెన్స్‌ ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆందోళన - Fix reasonable charges for ambulance services for corona patients Directs SC to states
close
Published : 12/09/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్స్‌ ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆందోళన

దిల్లీ: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగులు/ అనుమానితులకు సేవలందించేందుకు న్యాయమైన ధరలకే అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దేశంలో రోజురోజుకీ వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్‌ ఛార్జీల పెంపుపై దాఖలైన పిల్‌పై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కాకుండా కరోనా రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రాలు న్యాయబద్ధమైన ధరలకు సేవలందించాలని సూచించింది. 

కరోనా అనుమానితులు, కరోనా రోగులకు రవాణా సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. అంబులెన్స్‌లను తగినన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించిన ధర్మాసనం.. వీటి సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ణయించాలని ఆదేశించింది. అంబులెన్స్‌లన్నింటినీ అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించింది. కొన్ని రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయడంలేదని న్యాయస్థానం పేర్కొంది. ఇతరుల దయతో అంబులెన్స్‌లు పొందాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేసింది. అంబులెన్స్‌ సేవల కోసం రూ.7వేలు చొప్పున వసూలు చేస్తున్నారని.. కొన్నిసార్లయితే రూ.50వేల దాకా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని