ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి - Flight passengers from 4 states need to produce negative COVID-19 report says Bengal govt
close
Published : 25/02/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రాష్ట్రాల వారికి కొవిడ్‌ నెగెటివ్‌ తప్పనిసరి

దిల్లీ, బెంగాల్‌ ప్రభుత్వాల నిర్ణయం

కోల్‌కతా: దేశంలో కరోనా వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చే  విమాన ప్రయాణికులకు నిబంధనలు విధించింది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి బెంగాల్‌కు విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేసింది. తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కొవిడ్ నెగెటివ్‌ నివేదికలు ఉండాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు కొవిడ్ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించింది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది ఆగస్టులో జారీచేసిన ఈ ఆదేశాన్ని మరోసారి పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి ప్రయాణికులు ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇదే తరహా నిబంధనలు విధించేందుకు దిల్లీ సైతం సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని