మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట! - Follow corona guidelines make planet healthy PM Modi on what he wants on birthday
close
Published : 18/09/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!

ఆరోగ్యవంతమైన భూగోళం కావాలన్న ప్రధాని

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎలాంటి బహుమతి కావాలని ఎంతోమంది అభిమానులు అడిగారు. దీనిపై స్పందించిన మోదీ తనకు సురక్షితమైన భూమి కావాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని అదే తనకు పుట్టిన రోజు కానుక అని అన్నారు. ప్రధాని గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘పుట్టినరోజును పురస్కరించుకొని నాకు ఎలాంటి బహుమతులు కావాలని చాలామంది అడిగారు. నాకు మీ నుంచి ఈ బహుమతులే కావాలి’ అంటూ ఓ జాబితాను పంచుకున్నారు. 

‘ప్రతిఒక్కరూ మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. ఒకచోట గుమిగూడ వద్దు. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోండి. అందరం కలిసికట్టుగా ఈ భూగోళాన్ని ఆరోగ్యకరంగా మార్చుదాం’ అంటూ ట్వీట్‌ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. పౌరుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ అభినందనలు తనకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని