‘‘భారత్‌లో ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లు పెరిగాయి’’   - Food delivery volumes in India reach pre-COVID-19 peaks
close
Published : 13/10/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘భారత్‌లో ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లు పెరిగాయి’’  


ఇంటర్నెట్‌ డెస్క్‌ : భారత్‌లో ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌లు పెరిగాయని, కొవిడ్‌కు ముందున్న పరిస్థితి ఏర్పడిందని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ సోమవారం పేర్కొన్నారు. ఆర్డర్ల పెరుగుదల గురించి ఇది వరకే ఊహించామని ఆయన వివరించారు. ‘‘ ఈ విషయాన్ని మీతో పంచుకోవటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చాలా నగరాల్లో 120 శాతం కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో నెలకు 15 నుంచి 25 శాతం వరకు ఆర్డర్ల పెరుగుదల ఉంటుందని ఊహించాం. మహమ్మారి సమయంలో వినియోగదారులకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ఎంపికల్లో ఫుడ్‌ డెలివరీ ఒకటి’’ అని ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. 
‘‘ మార్చి 23 నుంచి  మొత్తం 9.2 కోట్ల ఆర్డర్లు తీసుకున్నాం. ఇప్పటివరకు ఫుడ్‌ డెలివరీ వల్ల గానీ మా ఏజెంట్ల వల్ల గానీ కొవిడ్‌ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు. మా ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్‌ భాగస్వాములు జాగ్రత్తల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారికి కృషికి సెల్యూట్‌ చేస్తున్నాం’’ అని గోయల్‌ పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం, ఆహారం ప్యాకింగ్‌, తయారీ, డెలివరీ గురించి భయపడక్కర్లేదని డబ్ల్యూహెచ్‌వో కూడా స్పష్టంగా పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని