విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్‌ - Foreign direct investment increased
close
Published : 21/10/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్‌

16% వృద్ధితో 27.1 బిలియన్‌ డాలర్లకు చేరిక

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో 27.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.03 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మన దేశానికి తరలి వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఎఫ్‌డీఐలు 23.35 బి.డాలర్ల నుంచి 16 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. పెట్టుబడులపై పొందిన ఆదాయాల్ని కూడా తిరిగి పెట్టుబడి పెట్టగా, ఆ మొత్తం ఎఫ్‌డీఐలు 13 శాతం వృద్ధితో 35.73 బి.డాలర్లకు చేరాయి. 2019-20 ఏప్రిల్‌-ఆగస్టులో మొత్తం ఎఫ్‌డీఐలు 31.60 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 2008-14 మధ్య కాలంలో భారత్‌కు చేరిన మొత్తం ఎఫ్‌డీఐలు 231.37 బి.డాలర్లతో పోలిస్తే 2014-20 మధ్య కాలంలో 55 శాతం వృద్ధి చెంది, 358.29 బి.డాలర్లకు చేరడం విశేషం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని