డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు లేవు - Forensic Science Laboratory has given clean chit to Karan Johar
close
Published : 26/10/2020 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు లేవు

ముంబయి: ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌ ప్రముఖుల కోసం 2019లో ఏర్పాటు చేసిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు ఆధారాలు లభ్యం కాలేదు. ఈ మేరకు ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) కరణ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నటులు డ్రగ్స్‌ సేవించినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. వీడియోలో కనిపిస్తోన్న తెల్లటి గీత ట్యూబ్‌లైట్‌ ప్రతిబింబమని నిర్ధారించినట్లు తెలిసింది.

బాలీవుడ్‌ స్టార్స్‌ కోసం కరణ్‌ పార్టీ ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, రణ్‌బీర్‌ కపూర్‌, మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, జోయా అక్తర్‌, అయాన్‌ ముఖర్జీ, మీరా రాజ్‌పూత్‌ తదితరులు పార్టీలో కనిపించారు. కరణ్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన తర్వాత విమర్శలు వెల్లువెత్తాయి. నటీనటుల ప్రవర్తన చూస్తుంటే డ్రగ్స్‌ తీసుకున్నట్లు అర్థమౌతోందని కామెంట్లు చేశారు. బాలీవుడ్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ సేవించారని శిరోమణి అకాలీదళ్ నాయకుడు మన్‌జిందర్‌ సింగ్‌ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ బాలీవుడ్‌ నటులకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అప్పట్లో కరణ్‌ వివరణ ఇస్తూ.. అలాంటి తప్పు జరిగి ఉంటే ఎందుకు వీడియో పోస్ట్‌ చేస్తానని ప్రశ్నించారు.
ఏదేమైనప్పటికీ ఇప్పుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. దీంతో మళ్లీ కరణ్‌ పార్టీ వీడియో చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం మన్‌జిందర్‌ సింగ్‌.. కరణ్‌, దీపిక, మలైకా, అర్జున్‌, షాహిద్‌ కపూర్‌, విక్కీ తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ విచారణ జరిపి, కరణ్‌ పార్టీలో డ్రగ్స్‌ ఉపయోగించినట్లు ఆధారాలు దొరకలేదని పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని