మహేశ్.. రానాలకు పవన్‌ క్రిస్మస్‌ కానుక..! - Friendship Goals!Pawan Kalyan and his wife send Christmas goodies to Mahesh Babu and Namrata
close
Updated : 24/12/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్.. రానాలకు పవన్‌ క్రిస్మస్‌ కానుక..!

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని అగ్రకథానాయకుడు పవన్‌ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నోవాలు మహేశ్‌బాబు, నమ్రతలతో పాటు యువ నటుడు రానా, మిహికాలకు కానుకలను పంపించారు. ప్రత్యేక గ్రీటింగ్ కార్డు ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ నమ్రత ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ‘మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ...’ అని ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రానా స్పందిస్తూ.. ‘మీ అభిమానానికి ధన్యవాదాలు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండస్ట్రీలో పవన్‌-మహేశ్‌లు మంచి స్నేహితులు. 2008లో పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్‌ఓవర్‌ ఇచ్చారు. ఇటీవలే దిల్ రాజు జన్మదిన వేడుకలల్లోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌ జంటగా ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌లో రానా దగ్గుబాటి నటించనున్నారు. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని