క్రమంగా వృద్ధి చెందుతున్న జీడీపీ - GDP growth to enter positive rate in Q4 Niti VC
close
Published : 02/12/2020 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రమంగా వృద్ధి చెందుతున్న జీడీపీ

దిల్లీ: కరోనా వైరస్‌ సృష్టించిన నష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా బయటపడుతోందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన పీటీఐతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మెరుగైన  జీడీపీ గణాంకాలు నమోదయ్యాయని అన్నారు. కరోనా ముందునాటి స్థితికి ఆర్థిక వ్యవస్థ క్రమంగా చేరుకుంటోందని వెల్లడించారు. జీడీపీ వృద్ధికోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి వల్లే ఆర్థిక వ్యవస్థ ముందెన్నడూ లేని నష్టాలను చవిచూసిందని పేర్కొన్నారు.

దేశరాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల గురించి రాజీవ్‌కుమార్ స్పందించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ విధానాలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వీటిద్వారా పంటలను ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛ లభిస్తుందన్నారు. దేశమంతా ఈ చట్టాలను అంగీకరించినా కేవలం రెండు, మూడు రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. రైతులకు వీటిపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని