సినిమా డైలాగ్‌ కొట్టి.. షోకాజ్‌ నోటీస్‌ పట్టి - Gabbar Singh On Duty As Cop Gos Trouble
close
Updated : 18/11/2020 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమా డైలాగ్‌ కొట్టి.. షోకాజ్‌ నోటీస్‌ పట్టి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ఫేమస్‌ ‘షోలే’చిత్రంలోని గబ్బర్‌సింగ్‌ డైలాగ్‌ను ఓ పోలీసు అధికారి చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారింది. దీంతో ఆ పోలీసు ఆఫీసర్‌ చిక్కుల్లో పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని  జబువా జిల్లాలో కల్యాణ్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఇన్‌ఛార్జిగా ఉన్న  కేఎల్‌ దంగి పెట్రోలింగ్‌ రౌండ్‌లో భాగంగా తిరుగుతున్నాడు.  ఈ క్రమంలో గబ్బర్‌ సింగ్‌ (అ డైలాగ్‌ ‘సో జా బేటా నహీ తో గబ్బర్‌ ఆయేగా( పిల్లలు పడుకోండి లేదా గబ్బర్‌ వస్తాడు)’అని పోలీస్‌ జీపులోని మెగా ఫోన్‌ ద్వారా చెప్పాడు. అనంతరం ఆ ప్రాంతంలో ‘పిల్లలు పడుకోండి లేదా దంగీ వస్తాడు’అని పిల్లల తల్లులు కూడా తమ పిల్లలను భయపెట్టడం ప్రారంభించారు. దీంతో 15 సెకన్ల  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో అధికారులు ఆ పోలీసు అధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  ప్రాథమిక విచారణ అనంతరం సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆనంద్‌ సింగ్‌ చెప్పారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని