నాకు వినపడకపోయినా నీకు గంట కొడుతున్నా: శ్రియ - Gamanam Trailer Out Now
close
Updated : 11/11/2020 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు వినపడకపోయినా నీకు గంట కొడుతున్నా: శ్రియ

పవన్‌ చేతుల మీదగా ‘గమనం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకూ వినపడదని నాకేం తెలుసు’ అని భావోద్వేగానికి గురి అవుతున్నారు నటి శ్రియ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గమనం’. విభిన్న కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం ఉదయం పవన్‌కల్యాణ్‌  విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ బదిర మహిళ పాత్రలో కనిపించనున్నారు.

‘ఆ మబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడి వరకూ వెళతాయో వాటికే తెలియదు. అలా వెళ్తూ వెళ్తూ వానై కరిగిపోతాయ్‌. ఒకటి వానైతే.. ఇంకొకటి ఒంటరిదైపోతుంది’ అని ప్రియాంక జవాల్కర్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ‘దానికి చెప్పుండ్రి. ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చినా. ఇక్కడ నాకు పెళ్లయ్యింది. ఎవరు చేస్తారు ఆ చెవిటి దానితో సంసారం’ అని భర్త అన్న మాటలు విని శ్రియ బాధపడడం.. ఇలా పలు సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో నిత్యామేనన్‌ సైతం ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని