ప్రతీ కెప్టెన్‌ అలాంటోడ్నే కోరుకుంటారు - Gautam Gambhir lauds England allrounder Benstokes comparing no one can reach him in the present cricket
close
Published : 27/07/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతీ కెప్టెన్‌ అలాంటోడ్నే కోరుకుంటారు

బెన్‌స్టోక్స్‌పై గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసల వర్షం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ లాంటి ఆటగాడినే ప్రతీ కెప్టెన్‌ కోరుకుంటాడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌, జాతిన్‌ సప్రూతో కలిసి అతడు మాట్లాడిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్‌ ఆదివారం ట్విటర్‌లో పంచుకుంది. అందులో గౌతీ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతగాడిని టీమ్‌ఇండియాతో పాటు, ప్రపంచంలోని ఏ క్రికెటర్‌తోనూ పోల్చలేమన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతడు ఆడేటట్లు ప్రస్తుత క్రికెట్‌లో ఎవరూ లేరన్నాడు. 

బెన్‌స్టోక్స్‌ లాంటి ఆటగాడు ఉండాలని ప్రతీ కెప్టెన్‌ కలగంటాడని, అతడిలా ఆడాలని చాలా మంది అనుకున్నా దురదృష్టవశాత్తు ఎవరూ తన సమీపంలోకి కూడా రాలేకపోతున్నారన్నాని తెలిపాడు.  అతడు కెప్టెన్సీ అవసరం లేని నాయకుడని, తన ఆటతోనే ఆ కీర్తిని గడిస్తాడని చెప్పాడు. కాగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌ జట్టంతా ఒక ఎత్తైతే స్టోక్స్‌ ఒక్కడే ఒక జట్టులా ఆడుతున్నాడు. ఇక మూడో టెస్టులోనూ మరోసారి మంచి ప్రదర్శన చేస్తే పర్యాటక విండీస్‌ జట్టుకు ఓటమి తప్పకపోవచ్చు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని