3 నిమిషాలు.. 53 యోగాసనాలు - Girl from Kerala Breaks Record with yoga
close
Updated : 13/10/2020 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 నిమిషాలు.. 53 యోగాసనాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన అభిజ్ఞ అనే ఓ ఐదో తరగతి విద్యార్థిని యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మూడు నిమిషాల వ్యవధిలో 53 రకాల యోగాసనాలు ప్రదర్శించి అమెరికా గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో 3నిమిషాల్లో 34 ఆసనాల మీద ఉన్న గత రికార్డును అభిజ్ఞ తిరగరాసింది. ఆమె గతంలోనూ కర్ణాటక, పుదుచ్చేరిల్లో నిర్వహించిన యోగా పోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. అభిజ్ఞ నాలుగేళ్ల ప్రాయం నుంచే తల్లి తేజాకుమారి వద్ద యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చిన్నారి భారత విద్యా భవన్‌కు చెందిన విద్యాలయంలో శిక్షణ పొందుతోంది. నృత్య విభాగంలో ప్రత్యేక తర్ఫీదు పొందుతున్న ఈ బాలిక భరత నాట్యంలోనూ మంచి ప్రతిభ చూపిస్తోంది. నాగిని నృత్యంలోనూ అభిజ్ఞ వినూత్న ప్రదర్శనతో అదరగొడుతోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని