మరోసారి అదరగొట్టిన కీర్తిసురేశ్‌ - Good Luck Sakhi Telugu Teaser
close
Published : 16/08/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి అదరగొట్టిన కీర్తిసురేశ్‌

హైదరాబాద్‌: ‘మన రాతను మనమే రాసుకోవాలా’ అంటోంది కీర్తిసురేశ్‌. ‘మహానటి’తో అందరి హృదయాలను దోచుకున్న ఆమె మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. కీర్తిసురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నాగేశ్‌ కుకునూరు దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

కీర్తిసురేశ్‌ మరోసారి విభిన్నమైన పాత్రను ఎంచుకున్నారు. అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఏకంగా రైఫిల్‌ షూటింగ్‌లో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నదనే విషయాన్ని అలరించేలా తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్‌రాజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని