వారంలో మూడురోజులే ఆఫీసుకు: గూగుల్‌ - Google Says 3 Days a Week in Office Rest Can Be WFH: Report
close
Updated : 15/12/2020 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో మూడురోజులే ఆఫీసుకు: గూగుల్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడుతున్న సమయంలో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకొనే వెసులుబాటు ఇచ్చిన మొదటి సంస్థ గూగుల్. ఇప్పటికే తమ ఉద్యోగులకు 2021 జూన్‌ వరకూ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ఇచ్చిన గూగుల్‌ తాజాగా సెప్టెంబర్‌ వరకు దాన్ని పొడిగించింది. అంతేకాకుండా ఉద్యోగులకు మరో వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులు వారంలో ఏవైనా మూడు రోజులు ఆఫీసుకు వస్తే చాలని, మిగతా మూడు రోజులూ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మెయిల్స్‌ పంపారు. ఉద్యోగులు ఇప్పటికీ కార్యాలయాలకు రావడానికి జంకుతుండటంతో దశలవారీగా కార్యకలాపాలు నిర్వహించేందుకు గూగుల్ సన్నద్ధమైంది. వాక్సిన్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ తిరిగి పూర్వపు కార్యకలాపాలు సాగించేందుకు చర్చలు ప్రారంభించాయి.

ఇవీ చదవండి..

యాపిల్‌లో మరికొన్ని రోజులు వర్క్‌ ఫ్రం హోంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని