‘వకీల్‌సాబ్‌’ పక్కా వస్తున్నాడా? - Gossips On Vakeel Saab Release Date
close
Published : 30/12/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’ పక్కా వస్తున్నాడా?

సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే..?

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  2020లో వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ కరోనా కారణంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ప్రారంభమైన ‘వకీల్‌సాబ్‌’ షూట్‌ తాజాగా పూర్తయ్యింది.

ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌ గురించి ఇప్పుడు చాలామంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీంతో సినిమా రిలీజ్‌ గురించి నెట్టింట్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ‘వకీల్‌సాబ్‌’ను విడుదల చేయాలని దిల్‌రాజు భావిస్తున్నారట. ఈ మేరకు వచ్చే ఏడాది వేసవి విడుదలయ్యే పెద్ద సినిమాల జాబితాలో ‘వకీల్‌సాబ్‌’ ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.

‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్లపాటు పవన్‌ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌ ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీ శ్రుతిహాసన్‌ కనిపించనున్నారు. అలాగే నివేదాథామస్‌, అంజలి కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.

ఇదీ చదవండి

వకీల్‌సాబ్‌ పవన్‌పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని