వ్యాక్సిన్ కోసం సైబర్‌ మాయగాళ్ల వలలో పడకండి.. - Government says cybercriminals luring people to pay and register for priority coronavirus vaccine
close
Published : 30/12/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్ కోసం సైబర్‌ మాయగాళ్ల వలలో పడకండి..

దిల్లీ: ఇతరుల కంటే ముందుగా వ్యాక్సిన్‌ పొందాలనుకుంటున్నారా..? అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకొనే సమయంలో నగదు చెల్లించండి.. అంటూ ఆకర్షించే సైబర్‌ నేరస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. వ్యాక్సిన్ల కోసం చెల్లింపులు చేయాలని తెలుపుతూ వచ్చే లింకులు, మెసేజులు, మెయిల్స్‌ వంటి వాటిని క్లిక్‌ చేయరాదని వారు తెలిపారు. హోంశాఖ నిర్వహిస్తున్న సైబర్‌ దోస్త్‌, సైబర్‌ సేఫ్టీ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ ట్విటర్‌ ఖాతాల్లో ఈ మేరకు ప్రకటించారు. కొవిడ్‌-19 అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని సైబర్‌ నేరస్థులు ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని వారు తెలిపారు. ఇటీవల బ్రిటన్‌లో కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీలో హ్యాకర్ల జోక్యం పసిగట్టామని పలువురు పరిశోధకులు తెలిపారు. ఇంటర్‌పోల్‌ కూడా ఈ అంశానికి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో అన్ని దేశాలకూ ఆరెంజ్‌ నోటీస్‌ జారీ చేసింది. ఏవైనా చెల్లింపులు చేసే ముందు సంబంధిత లింకులను ధ్రువీకరించుకోవాలని సూచించింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఏ విధమైన అసత్య సమాచారాన్ని నమ్మకూడదని ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఏ నిర్ణయాన్నైనా బహిరంగంగానే ప్రకటిస్తామని తెలిపారు. మరి కొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం సైబర్‌ నేరస్థుల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. 

ఇవీ చదవండి..

నేడు రెండో రోజూ కొవిడ్‌ టీకా డ్రైరన్‌

మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాల రద్దు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని