కరోనా వ్యాక్సిన్‌ ఒప్పందం దిశగా తొలి అడుగు - Govt initiates action to explore coronavirus vaccine deal
close
Published : 18/08/2020 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వ్యాక్సిన్‌ ఒప్పందం దిశగా తొలి అడుగు

ఐదు ఫార్మా సంస్థలతో కేంద్రం సంప్రదింపులు

దిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే కార్యక్రమానికి సంబంధించిన చర్యల దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ అంశానికి సంబంధించి మూడు రోజుల్లోగా రోడ్‌మ్యాప్‌ను సమర్పించాల్సిందిగా.. కేంద్రం ఐదు దేశీయ ఫార్మా కంపెనీలను ఆహ్వానించింది.

దేశ కరోనా వ్యాక్సిన్‌ విధానం గురించి చర్చించేందుకు సోమవారం నిపుణుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు కావాల్సిన కనీస సమయం, ఆశిస్తున్న ధర తదితర వివరాలను తెలపాలంటూ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలాలతో పాటు.. బయోలాజికల్‌ ఈ, జెన్నోవాలను కోరారు. కాగా, ఈ విషయమై గురువారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆయా సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం సూచించింది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయత్నాలు విజయవంతం అయిన వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు వ్యాక్సిన్‌ తయారీదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ ఇప్పటి వరకూ ఏ సంస్థతోనూ ఆ విధమైన ఒప్పందానికి రాలేదు. ఈ నేపథ్యంలో దేశీయంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీదారును ఎంపిక చేసే బాధ్యతను.. నేషనల్‌ టెక్నికల్‌ ఎడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్ ఇమ్యునైజేషన్‌ (ఎన్టీఏజీఐ)కి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీకి అప్పగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని