ఎల్‌ఐసీ ఐపీఓకు మళ్లీ సన్నాహాలు - Govt prepare for LIC IPO
close
Published : 16/12/2020 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్‌ఐసీ ఐపీఓకు మళ్లీ సన్నాహాలు

వచ్చే నెలలో పెట్టుబడిదార్లతో సమావేశాలు

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రక్రియను ప్రభుత్వం మళ్లీ చేపడుతోంది. జనవరిలో పెట్టుబడిదార్లతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని (రూ.2.1 లక్షల కోట్లు) చేరేందుకు ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ దోహదపడనుంది.  కొవిడ్‌-19 సంక్షోభం పరిణామాల కారణంగా ఎల్‌ఐసీ ఇష్యూ ప్రక్రియ జాప్యమవుతూ వస్తోంది. వచ్చే త్రైమాసికంలో పెట్టుబడిదార్ల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారి వెల్లడించారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీలో మైనారిటీ వాటా విక్రయ ప్రక్రియ కోసం యాక్చురియల్‌ సంస్థను వచ్చే 7-10 రోజుల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం నియమించనుంది.

2020-21లోనే రైల్‌టెల్‌ ఇష్యూ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే రైల్‌టెల్‌ ఐపీఓ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం సంయుక్త కార్యదర్శి అలోక్‌ పాండే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగం రైల్‌టెల్, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌ఐసీ ఐపీఓల మీద కృషి చేస్తోంది. అయితే సమయం తక్కువగా ఉండటంతో ఐఆర్‌ఎఫ్‌సీ ఇష్యూ మాత్రమే వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పాండే స్పందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని