కరోనా పోరులో ‘అంకురాల’ ఆవిష్కరణలు అదుర్స్‌ - Govt supporting hundreds of projects in fight against coronavirus Vardhan
close
Published : 07/12/2020 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పోరులో ‘అంకురాల’ ఆవిష్కరణలు అదుర్స్‌

ముంబయి: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా వందల కొద్దీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖా మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కొవిడ్‌-19 నియంత్రణ, చికిత్స కోసం వందకు పైగా అంకుర సంస్థలు సరికొత్త ఆవిష్కరణలు చేశాయన్నారు. భారత్‌-పోర్చుగల్‌ సాంకేతిక సదస్సులో ఆయన మాట్లాడారు. టీకా పరిశోధన కోసం ప్రభుత్వం 120 మిలియన్‌ డాలర్లు ప్రకటించిందని వెల్లడించారు.

‘సంప్రదాయ విజ్ఞానం ఆధారంగా స్వదేశీ వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పద్ధతులు, చికిత్స పద్ధతుల నుంచి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడం, సేవలు అందించడం వరకు భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆర్‌అండ్‌డీ సంస్థలు మహమ్మారిపై పోరాడేందుకు సంయుక్తంగా శ్రమిస్తున్నాయి. వందల కొద్దీ ప్రాజెక్టులకు అండగా నిలిచాం. కొవిడ్‌-19 కోసం వందకు పైగా అంకుర సంస్థలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించాయి’ అని హర్షవర్ధన్‌ తెలిపారు.

దాదాపుగా 30 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్‌ అన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు సైతం ఆయనే చూస్తున్న సంగతి తెలిసిందే. రెండు టీకాలు అత్యంత పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ‘కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుపుతున్నాయి. ఇందులో ప్రతిష్ఠాత్మక ఐసీఎంఆర్‌ భాగమైంది. వివిధ దేశాలకు చెందిన కీలక వ్యాక్సిన్ల ట్రయల్స్‌ సైతం భారత్‌లో జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను సీరమ్‌, రష్యా వ్యాక్సిన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ తయారీతో పాటు పంపిణీ చేయనున్నాయి’ అని ఆయన వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని