కరోనా వ్యాక్సిన్‌ సరఫరాకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు? - Govt to set up task force to tackle COVID vaccine distribution
close
Published : 08/08/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కరోనా వ్యాక్సిన్‌ సరఫరాకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు?

దిల్లీ:  కరోనా వైరస్‌ను కట్టడి చేసే కొవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆతృతగా వేచిచూస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఇప్పటి వరకూ ఆరు వ్యాక్సిన్‌ల తయారీ మూడవ దశ లేదా దానికి సమీపంలో ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కాగా, కరోనా వ్యాక్సిన్‌ను అందిపుచ్చుకునేందుకు వివిధ దేశాలు తయారీదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ తయారీ మాత్రమే కాకుండా దాని పంపిణీ కూడా ప్రభుత్వాలకు సవాలు కానుందని స్పష్టమవుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది.

భారత్‌కు అనుగుణమైన కొవిడ్‌ వ్యాక్సిన్ల గుర్తింపు, కొనుగోలు, అందుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ, సరఫరా తదితర కీలక అంశాలను ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షించనుంది. ఈ బృందానికి నీతి ఆయోగ్‌ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ సారథ్యం వహించగా, హెల్త్‌ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ ఉపాధ్యక్షులుగా ఉండనున్నారని కూడా తెలియవచ్చింది. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన నిపుణులు బృంద సభ్యులుగా ఉండనున్నారు.

ఇక భారత్‌లో వరుసగా రెండో రోజు కూడా 60 వేల మందికి పైగా కొవిడ్‌-19 బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 61,537 మందికి కరోనా సోకటంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20,88,612కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య 42,518గా నమోదయింది. అయితే రికవరీ రేటు 68.32 శాతంగా ఉండటం ఒక్కటే కాస్త ఊరటనిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని