నాన్న మమ్మల్ని అలా పెంచారు: నాగబాబు - Grow your Skills by Naga Babu
close
Published : 30/11/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న మమ్మల్ని అలా పెంచారు: నాగబాబు

హైదరాబాద్‌: పిల్లల్ని తల్లిదండ్రులు సంవత్సరంలో ఒక్కసారైనా విహార యాత్రకు తీసుకెళ్లాలని.. ఆ విషయంలో తాను కొంత విఫలమయ్యానని మెగా బ్రదర్‌ నాగబాబు అన్నారు. అలా తీసుకెళ్లినప్పుడే వాళ్లలోని నైపుణ్యం మనకు తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి.. తమను పెంచే విషయంలో వ్యవహరించిన విధానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఈతరం తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి కూడా ఆయన పలు సూచనలు చేశారు.

‘‘మేం పరీక్షల్లో ఫెయిల్‌ అయినా.. పాస్‌ అయినా.. మా ఇంట్లో ఏం అనేవాళ్లు కాదు. కాకపోతే.. పాస్‌ అయితే చాలు అనేవారు. ఎంతో మద్దతు ఇచ్చేవాళ్లు. మా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్లో పనిచేసే మా నాన్నకు ఎంతో లోకజ్ఞానం ఉండేది. మా కోరికలు, ఆలోచనలను గౌరవిస్తూనే.. మార్గ నిర్దేశనం చేసేవారు. మా అన్నయ్య సినిమాల్లోకి వచ్చే విషయంలోనూ ఆయన ఎంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా జీవితంలో స్థిరపడటానికి, నిర్మాతగా మారడానికి మా అన్నయ్యే ముఖ్య కారణం. కానీ.. ‘నువ్వు స్వతంత్రంగా ఎదగాలి’ అని చెప్పేవారు. అలాగే మా తమ్ముడికి కూడా కెరీర్‌ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మేం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆయన మా నిర్ణయానికి వదిలేస్తూనే.. ప్లాన్‌-ఏ తో పాటు ప్లాన్‌-బీ కూడా ఇచ్చేవారు’ అని నాగబాబు గుర్తు చేసుకున్నారు.

‘‘పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలి. మా కాలంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. మాకు, మా పిల్లలకు దొరికినంత స్వేచ్ఛ.. వాళ్ల పిల్లలకు దొరకడం లేదు. మన భయాలు, ఆలోచనలు వాళ్ల స్వేచ్ఛకు ఆటంకం కాకూడదు. ఎండలో ఆడకూడదు.. వర్షంలో తడవకూడదు.. ఇలాంటివన్నీ పిచ్చి మాటలు. వాళ్లను ప్రకృతిని ఆస్వాదించనివ్వాలి. పిల్లల్ని మరీ సున్నితంగా పెంచకూడదు. పిల్లల్ని కొంచెమైనా రఫ్‌గా పెంచాలి. ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు నేర్పించాలి. ఒక తండ్రి అనే వాడు.. పిల్లలతో రోజుకు కనీసం గంటసేపైనా సమయం గడపాలి. తల్లి ఎలాగూ కావాల్సినంత సమయం కేటాయిస్తుంది. వారాంతాల్లో కనీసం ఒకరోజులో సగమైనా వాళ్లతో ఉండాలి. అప్పుడే వాళ్ల ఆలోచనలు, సామర్థ్యాలు తెలుస్తాయి’ అని నాగబాబు తెలిపారు.

ఇదీ చదవండి..

వరుణ్‌, నిహారిక విషయంలో నా తప్పు అదే..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని