పూజా చేతికి మరో ‘కీ’ ప్రాజెక్టు? - Gunasekhar in talks with PoojaHegde for Shaakuntalam movie
close
Published : 28/12/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూజా చేతికి మరో ‘కీ’ ప్రాజెక్టు?

ఈ ప్రేమకథా చిత్రంలోనూ హీరోయిన్‌గా..

హైదరాబాద్‌: దక్షిణాది చిత్రపరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా మారుతున్నారు కథానాయిక పూజాహెగ్డే. ఇప్పటికే ఆమె చేతిలో ‘రాధేశ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘సర్కస్‌’ చిత్రాలున్న విషయం తెలిసిందే. వీటితోపాటు ‘ఆచార్య’ సినిమాలో చెర్రీ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా పూజాహెగ్డే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించనున్న ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రేమకథా చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించే అవకాశాలున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధానపాత్రలో పూజాహెగ్డే అయితే బాగుంటుందని గుణశేఖర్‌ భావించారట. ఈ మేరకు ఇప్పటికే ఆయన పూజాతో సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. మరోవైపు, ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్న పూజా.. తన తదుపరి చిత్రం ‘సర్కస్‌’ చిత్రీకరణను కొన్నిరోజులపాటు వాయిదా వేయమని చిత్రబృందాన్ని కోరినట్లు తెలుస్తోంది. డేట్స్‌లో క్లాష్‌ రావడంతోనే ఆమె చిత్రబృందాన్ని ఈ విధంగా కోరినట్లు బీటౌన్‌లో మాట్లాడుకుంటున్నారు.

ఇదీ చదవండి

‘ఆచార్య’లో జిగేలు రాణి?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని