భావోద్వేగభరితంగా జాన్వీ గుంజన్‌ సక్సేనా ట్రైలర్‌ - Gunjan Saxena: The Kargil Girl Trailer
close
Published : 01/08/2020 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భావోద్వేగభరితంగా జాన్వీ గుంజన్‌ సక్సేనా ట్రైలర్‌

ముంబయి: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. జాన్వీకపూర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా శరణ్‌ శర్మ దీన్ని తెరకెక్కించారు. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్‌లో ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు.

‘మీరు ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంటే మీరొక సైనికుడు అవ్వాలి. లేదంటే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అంటూ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి పైలెట్‌ కావాలనుకున్న గుంజన్‌ సక్సేనా ఎలాంటి ప్రయత్నాలు చేసింది. శిక్షణలో ఆమెకు ఎదురైన అనుభవాలు, అవమానాలు ఏంటి? వాటన్నింటినీ అధిగమించి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా పైలెట్‌గా ఎలా ఆవిర్భవించిందన్న వాస్తవ సంఘటనలను భావోద్వేగ భరితంగా తెరకెక్కించారు దర్శకుడు శరణ్‌. ‘నాన్న మిమ్మల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వను’ అంటూ గుంజన్‌ పాత్రలో జాన్వీ పలికిన సంభాషణలు ఉద్విగ్నంగా ఉన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని