ప్రేమించే అమ్మాయి.. భయపడే అబ్బాయి.. - Guvva Gorinka Telugu Movie Trailer
close
Published : 12/12/2020 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమించే అమ్మాయి.. భయపడే అబ్బాయి..

ఆసక్తికరంగా గువ్వ గోరింక ట్రైలర్‌

హైదరాబాద్‌: విలక్షణ నటనతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. థియేటర్లు మూతపడ్డ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఓటీటీ వేదికగా తన సినిమాలతో అభిమానులను అలరించాడు. తాజాగా మరో సినిమా ‘గువ్వ గోరింక’తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా.. చిత్రబృందం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘‘ఈమె పేరు శిరీష.. సంగీతమే ఈమె ప్రపంచం. ఇతని పేరు సదానందం.. చదువుతోంది మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ. సంగీతమే ప్రాణమైన అమ్మాయికి.. సౌండ్‌ అంటేనే పడని ఓ అబ్బాయి..’’ అంటూ ట్రైలర్‌ మొదలవుతుంది. మొదట్లో సౌండ్‌కు భయపడే హీరో ఆఖర్లో తన శైలికి విరుద్ధంగా హీరోయిన్‌పై అరుస్తాడు. అయితే.. పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వీళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు.? గువ్వాగోరింకల్లా మారిన వీళ్ల ప్రేమ కథలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..? అనేదే సినిమా.

ఈ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు మోహన్‌ బమ్మిడి దర్శకత్వం వహించారు. సత్యదేవ్‌, ప్రియాలాల్‌ హీరోహీరోయిన్లు. కీలక పాత్రల్లో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. సురేశ్‌బొబ్బిలి సంగీంతం అందించారు. దామురెడ్డి, జీవన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ట్రైలర్‌ను మీరూ చూసేయండి. 

ఇదీ చదవండి
ఆమెను చూసి స్ఫూర్తి పొందా: విజయ్‌ దేవరకొండ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని